నాన్న నట వారసత్వమే కాకుండా సేవాతత్వం కూడా కొనసాగిస్తా: రామ్ చరణ్?

రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ లాంచ్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్ ను లాంచ్ చేశారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాన్న నట వారసత్వాన్ని మాత్రమే కాకుండా సేవాతత్వం కూడా తీసుకుంటున్నాను. చిన్నచిన్న అడుగులతో నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. మరొక 30 ఏళ్ల పాటు నా ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు సేవలు కొనసాగుతాయి. రెండోదశలో బ్లడ్ బ్యాంకు కోసం ప్రత్యేక యాప్ ను తయారు చేయాలనే ఆలోచన ఉంది.

మా సినిమా పారితోషికాలతో ఈ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కొనసాగుతోంది అని తెలిపారు.ఈ ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా ఇకపై గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని టైం కు వచ్చి పని చేసుకుని వెళ్ళు అని తెలిపారు.

రామ్ చరణ్ ఆవిష్కరించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ 25 భాషల్లో అందుబాటులో ఉంటుందనీ, ఇదే కాకుండా దేశవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ విస్తరణ జరుగుతుందని తెలిపారు. స్లాట్ బుక్ చేసుకుని రక్తదానం చేయొచ్చని, అలాగే చిరంజీవి సినిమా, రాజకీయ, వ్యక్తిగత విషయాలు ఇలాంటి వన్నీ ఈ వెబ్సైట్లో లభిస్తాయి అని తెలిపారు