రెబల్ స్టార్ ప్రభాస్ తన 25వ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్` అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించబోతున్నారు.
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీనికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. అసలు స్పిరిట్ స్టోరీ మొదట ప్రభాస్ వద్దకు వెళ్లలేదట. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కథను సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రాశారట.
అయితే ఆ కథ మహేష్ కు నచ్చలేదట. దాంతో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఆ కథను ప్రభాస్‌కు వినిపించగా.. ఆయన వెంటనే ఇంప్రెస్ అయ్యాయని టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.