సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ స్థాయికి చేరుకున్నాడు. కెరీర్ పరంగా ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. అయితే ఎంత ఎదిగినా ప్రభాస్ ఎప్పుడూ ఒదిగే ఉంటారు.
ప్రభాస్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎంతోకొంత ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ప్రభాస్‌కు పెదనాన్న కృష్ణంరాజు-పెద్దమ్మ శ్యామలా దేవి అంటే ఎంతో ప్రేమ. సమయం దొరికినప్పుడల్లా వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రభాస్ ప్రయత్నిస్తాడు.
అలాగే తన పెదనాన్న కృష్ణంరాజుని `పెద్ద బాజీ` అని.. శ్యామలా దేవిని `కన్నమ్మ` అని ప్రభాస్ ఎంతో ప్రేమగా పిలుస్తాడట. అంతేకాదు, వారి ఫొన్ నెంబర్లను సైతం ఆ పేర్లతోనే ప్రభాస్ తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడట. కాగా, ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు చేస్తున్నాడు. ఇవి పూర్తైన తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది.