బాలీవుడ్‌కు మ‌కాం మారుస్తున్న జ‌గ్గూబాయ్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌!?

జగపతిబాబు అలియాస్‌ జగ్గూబాయ్‌.. ప్ర‌స్తుతం ద‌క్ష‌ణాదిలోనే మోస్ట్ వాంటెడ్ విల‌న్‌గా మారిపోయాడు. ఫ్యామిలీ హీరోగా కెరీర్ మొద‌ట్లో ఎన్నో హిట్లు అందుకున్న జ‌గ‌ప‌తిబాబు.. విల‌న్‌గా ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సౌత్‌లోనే స‌త్తా చాటిన జ‌గ్గూబాయ్‌.. త‌ర్వ‌లోనే బాలీవుడ్‌కు మ‌కాం మారుస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Jagapathi Babu manufacturing condoms!

తాజా స‌మాచారం ప్రకారం.. ఫర్హాన్‌ అక్తర్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో విల‌న్ న‌టించాలంటూ జ‌గ‌ప‌తి బాబును ఇటీవ‌ల మేక‌ర్స్ సంప్ర‌దించార‌ట‌. భారీ రెమ్యూన‌రేష‌న్ కూడా ఆఫ‌ర్ చేశార‌ట‌. రోల్ మ‌రియు రెమ్యూన‌రేష‌న్ రెండూ న‌చ్చ‌డంతో వెంట‌నే జ‌గ‌ప‌తిబాబు ఓకే చెప్పాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Jagapathi Babu's Savage Look in Aravinda Sametha Gets a Thumbs up

దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని స‌మాచారం. కాగా, అశుతోష్‌ గోవరికర్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ఈ సినిమాకు `పుకార్‌` అనే టైటిల్‌ ప్రచారంలో ఉండంగా.. డిసెంబ‌ర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది.