బిగ్‌బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడో వారం కొన‌సాగుతోంది. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వరుసగా ఎలిమినేట్ అవ్వ‌గా.. ఏడో వారం కాజల్, రవి, సిరి, ఆనీ మాస్ట‌ర్‌, ప్రియ, శ్రీరామ్, జస్వంత్‌లు నామినేట్ అయ్యాయి.

అలాగే ఈ ఏడుగురితో పాటు సీక్రెట్ రూంలో ఉన్న లోబో హోస్ట్ ద్వారా నేరుగా నామినేట్ అయ్యాడు. దీంతో ఈవారం నామినేషన్స్‌లో 8 మంది నిలిచారు. అయితే వీరిలో ఆనీ మాస్ట‌ర్ ఎలిమినేట్ కానుందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫ్యాన్‌బేస్‌ పెద్దగా లేని యానీ మాస్టర్‌ ఈవారం గట్టెక్కడం కష్టమే అనిపిస్తోంది.

Anee (Bigg Boss) Wiki, Biography, Age, Movies, Images - News Bugz

పెర్ఫామెన్స్ పరంగా మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోతుంది. తనను ఎవరైనా నామినేట్‌ చేస్తే సహించలేకపోయే స్వభావం, ఇతరులను కించపరుస్తూ మాట్లాడటం, నోరు జారడం.. ఇలా పలు అంశాలు ఆమెకు నెగెటివ్‌గా మారాయి. దాంతో ఈ వారం ఆనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో తెలియాలంటే ఆదివారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.