సంతానం కోసం వేశ్యలతో శృంగారం చేసి చివరికి..??

ఈ ఆధునిక కాలంలో ఇంకా మూఢనమ్మకాలను నమ్మేవారు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదా.మూఢ నమ్మకాలు, క్షుద్ర పూజలను నమ్మి ఎంతోమంది తోటి మనిషి ప్రాణాలను సైతం బలి ఇవ్వడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఒక భార్య భర్త చేసిన పని గురించి తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ.ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. సంతానం కోసం ఓ జంట రెండు నిండు ప్రాణాలను బలి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు వివరాల్లోకి వెళితే గ్వాలియర్ లో నివసించే బంటు బదౌరియా, మమతా దంపతులకు పెళ్లి అయ్యి 18 ఏళ్ల అయినాగానీ ఇప్పటికి పిల్లలు కలగలేదు. ఈ క్రమంలోనే కుటుంబ స్నేహితుడు అయిన నీరజ్ పర్మార్ సలహా మేరకు ఆ జంట గిర్వార్ యాదవ్ అనే భూతవైద్యుడ్ని సంప్రదించగా అతను మీకు పిల్లలు పుట్టాలంటే నరబలి ఒక్కటే మార్గమని చెప్పాడు.దీనికి బంటు, మమత సరేనని చెప్పి బలి ఈ బాధ్యతను నీరజ్ కు అప్పగించారు.

- Advertisement -

అయితే అతను ఒక వేశ్యను తీసుకొచ్చి ఆమెను బలిచ్చారు. కాగా చనిపోయిన వేశ్య శవాన్ని బైక్ పై తరలించే ప్రయత్నంలో కిందపడిపోవడంతో నీరజ్ భయపడి పోయి ఆ వేశ్య మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత మరో వేశ్యను తీసుకొచ్చి భూత వైద్యుడి సమక్షంలో బలి ఇచ్చారు. అయితే, మొదట వేశ్య మృతదేహం బయటపడడంతో పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం తెలిసింది.విచారణలో నీరజ్ పర్మార్ గురించి తెలిసి అతనిని అదుపులోకి తీసుకున్నారు.విచారణలో భాగంగా నీరజ్ చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం షాక్ అయ్యారు.బలి ఇవ్వడానికి తీసుకుని వచ్చిన మొదటి వేశ్యను నరబలి ఇచ్చే ముందు నీరజ్ సర్మార్ ఆమెతో సెక్స్ చేసాడట.

ఆమె మద్యం తాగడం వలన నరబలి చెల్లదని భూతవైద్యుడు చెప్పాడని రెండో వేశ్యను తీసుకొచ్చి నరబలి ఇచ్చామని నీరజ్ చెప్పాడు.అయితే రెండో వేశ్యను బలిచ్చే ముందు కూడా నీరజ్ ఆమెతో సెక్స్ లో పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు. కాగా అక్టోబర్ 13న తొలి నరబలి ఇవ్వగా, అక్టోబర్ 20న రెండో నరబలి ఇచ్చారు. మొదటి వేశ్య మృతదేహం వెలుగులోకి రావడంతో అసలు విషయం బయట పడింది. అలాగే ఈ హత్యలకు కారణం అయిన బంటు, మమతా దంపతులతో పాటు మమతా సోదరి మీరా రజావత్, భూతవైద్యుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ భూతవైద్యుడు మరిన్ని నరబలులు ఇచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Share post:

Popular