పుష్ప సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప.. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది.. అయితే మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి కాగా , దీనిని డిసెంబర్ 17వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.. పుష్ప ది రైజ్ అంటూ వస్తున్న ఈ మొదటి భాగం నుంచి ఇప్పటికే విడుదలైన వీడియోలు, పాటలు , చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇకపోతే ఈ సినిమా నుండి మూడవ సింగిల్ ని కూడా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన మూడవ సింగిల్ గ్లింప్స్ ను ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ గా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ విలన్ గా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూడవ సింగిల్ ప్రేక్షకులను, అభిమానులను ఏ తరహాలో ఆకట్టుకుంటుందో చూడాలి.

https://twitter.com/PushpaMovie/status/1452516286949322760?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1452516286949322760%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-428781192582079097.ampproject.net%2F2110011758000%2Fframe.html