పుష్ప సినిమా నుంచి సామి.. సామి..సాంగ్ ప్రోమో రిలీజ్..!!

October 25, 2021 at 4:45 pm

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రెండు భాగాలుగా విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తీస్తున్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమా పార్ట్ వన్ డిసెంబర్ 17వ తేదీన విడుదల కానుంది. ఇక ఇప్పటికే వరుసగా ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా, ప్రేక్షకులలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాయి..

ఇప్పటికీ దాక్కో.. దాక్కో మేక, శ్రీవల్లి పాటలు విడుదలయ్యి, యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి.. ఇక మూడో సింగిల్ సామి.. సామి .. అనే ప్రోమోను కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఈ ప్రోమో కూడా ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమో కి సంబంధించిన పూర్తి పాటను అక్టోబర్ 28వ తారీకు ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తామని పుష్ప చిత్రం యూనిట్ ప్రకటించింది.

పుష్ప సినిమా నుంచి సామి.. సామి..సాంగ్ ప్రోమో రిలీజ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts