అలాంటి కామెంట్స్ చేస్తూ రోజాని ఏడిపించారు.. వాళ్ళు ఎవరో తెలుసా?

ఎమ్మెల్యే రోజా తాజాగా జరిగిన ఊరిలో వినాయకుడు ఈవెంట్ లో తాను జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి, అలాగే తాను పడ్డ బాధ గురించి బాధపడుతూ ఎమోషనల్ అయ్యింది.ఈ ఊరిలో వినాయకుడు ఈవెంట్ లో యోధ రోజా రియల్ లైఫ్ లో రోజా ఎదుర్కొనే కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ నా జీవితంలో డబ్బులకు భోజనానికి కష్టాలు లేవని అమ్మ నాన్న ఉద్యోగం చేయడంతో ఆ ఇబ్బందులు ఎప్పుడూ ఎదురు కాలేదు అని రోజా తెలిపింది. తన నాన్నకి సినిమాలు అంటే ఎంతో ఇష్టమని, నిర్మాతగా నష్టపోయారని చెప్పుకొచ్చింది.

తన తండ్రి నిర్మాతగా వ్యవహరించిన ఒక సినిమాలో తాను ఒక పేద అమ్మాయి గా నటించానని తెలిపింది. షూటింగ్ లో అందరూ తనకు డ్యాన్స్ రాదని, డైలాగ్స్ చెప్పడం రాదు అని ఏడిపించే వాళ్ళని రోజా తెలిపింది. ఆ కామెంట్ లో ఎంతో బాధ పెట్టాయని రోజా తెలిపింది. ఇక దర్శకుడు సెల్వ మని దర్శకత్వంలో తెరకెక్కించిన చామంతి సినిమాలో తాను హీరోయిన్ గా నటించానని, ఇక అప్పటి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకో లేదని తెలిపింది. నిర్మాతగా తీసిన సమరం సినిమా వల్ల తాను కష్టపడి సంపాదించిన డబ్బు అంతా అప్పులు కట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తనకు తన పిల్లలు అంటే చాలా ఇష్టమని తెలిపింది. అలాగే తన కూతురు అన్షు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

Share post:

Latest