ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దీపికా పదుకొనే.. కారణం ఏంటంటే?

బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె బాలీవుడ్ తో పాటు వరల్డ్ వైజ్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అంతేకాకుండా బాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈమె ఇంటర్వ్యూలో తన గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

అయితే తెరపై కనిపించే హీరోహీరోయిన్లు, పైకి గొప్పగా ఉన్నప్పటికీ తెర వెనుక ఎన్నో ఇబ్బందులను పడుతూ ఉంటారు. అయితే కొంతమంది వీటిని తట్టుకోలేక, ఆ సమస్యలను అధిగమించలేక ఆత్మహత్యకు కూడా పాల్పడుతుంటారు తెలిపింది. అందరూ అటువంటి కష్టాలను ఎదుర్కొని నిలదొక్కుకొని స్టార్స్ ఎదుగుతారు అని దీపిక తెలిపింది. తాను కూడా 2014లో డిప్రెషన్ లోకి వెళ్ళిందని, ఆ సమయంలో తాను కూడా చనిపోవాలని అనుకున్నావు అంటూ తెలిపింది. అయితే ఇందుకు గల కారణం మాత్రం వెల్లడించలేదు. ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళడానికి లవ్ మ్యాటర్ అని వార్తలు వినిపిస్తున్నాయి.