ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుందోచ్!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ చూసేందుకు యావత్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ త్వరలో ఓ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ భారీ చిత్రాలు తమ రిలీజ్ డేట్‌లను వరుసగా అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి. దీంతో పాన్ ఇండియా మూవీగా ఆర్ఆర్ఆర్ కూడా తన రిలీజ్ డేట్‌ను లాక్ చేయాలని చూస్తోంది. నార్త్ ఇండియాలోని థియేటర్లు కూడా పూర్తిస్థాయిలో తెరుచుకునేందుకు రెడీ అవుతుండటంతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తమ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయాలని చూస్తోంది.

ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతోంది. అయితే ఏప్రిల్ నెలలో పలు బాలీవుడ్ చిత్రాలు రిలీజ్‌కు రెడీ కాగా, సౌత్ నుండి మరో పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ 2 కూడా రిలీజ్‌ను ప్లాన్ చేస్తుంది. మరి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంలో చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.