పవన్ కళ్యాణ్ సినిమాకు చిక్కులు తప్పవా..?

రిపబ్లిక్ సినిమా ఫ్రీరిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ వైసిపి మంత్రుల నుంచి కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తన సినిమా నిర్మాతకు సైతం కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళుతున్నానని చెప్పినట్లు సమాచారం. కానీ కొంతమంది టాలీవుడ్ హీరోలు నుంచి పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ లభిస్తోంది.తన ప్రసంగంలో టాలీవుడ్ హీరోలు కొంతమంది పేరును ప్రసంగించడం కూడా జరిగింది.

కానీ హీరో నాని తప్ప మిగతా హీరోలు ఎవరు ఆయనకి సపోర్టు లభించలేదు.కార్తికేయ దేవకట్టా కూడా స్పందించినా.. ఫలితం ఉండదు స్టార్ హీరోలు సైతం స్పందిస్తేనే పవన్ కళ్యాణ్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.పవన్ కళ్యాణ్ ఇలా రాజకీయంగా విమర్శలు చేయడంతో.. భవిష్యత్తులో జగన్ ఈ విమర్శలపై స్పందించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్లు రేటు తగ్గుదల అమలవుతున్నాయి.పవన్ చేసిన కామెంట్స్ వల్ల పవన్ భవిష్యత్తు సినిమాలకి ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 2022 సంక్రాంతి కానుకగా ఈ భీమ్లా నాయక్ విడుదల చేయనున్నారు.ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలకు ఇబ్బందులు ఎదురైతే ఫోన్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో వేచి చూడాలి.