రమ్యకృష్ణ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అందంలో, నటనలో, ఇలా ఎన్నో విషయాలలో ఆమెకు ఆమే సాటి. ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది. ప్రియురాలు, భార్య, తల్లి, అమ్మోరు, భక్తురాలు ఎన్నో సినిమాలలో గ్లామరస్ పాత్రలలో, అలాగే ట్రెడిషనల్ క్యారెక్టర్ లలో కూడా నటించింది రమ్యకృష్ణ. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ నిన సెప్టెంబర్ 15వ తేదీన 51 వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది.
రమ్యకృష్ణ పుట్టిన రోజు వేడుకలు కుటుంబ సభ్యులు అలాగే స్నేహితుల సమక్షంలో చేసుకుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. వారిలో రాధిక, ఖుష్బూ, లిజి, మధుబాల, త్రిష, రెజీనా లతోపాటు గా ఇంకా కొందరు నటీనటులు రమ్యకృష్ణ పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో చేయగా ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇక రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం బంగార్రాజు, రంగమార్తాండ, రిపబ్లిక్, లైగర్ లాంటి సినిమాలలో నటిస్తోంది.