కన్న కొడుకుపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన నటి?

సాధారణంగా తల్లితండ్రులు తమ పిల్లలు తప్పు చేసిన కూడా ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చూస్తుంటారు. ఇక సెలబ్రిటీలు అయితే వారి పిల్లలు తప్పు చేసిన కూడా ఆ విషయాన్ని బయటకు తెలియకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక మలయాళ నటి మాత్రం ఏకంగా తన కొడుకు పైనే లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆ నటి తన కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ నటి ఎవరు? అసలు ఏం జరిగింది? వివరాల్లోకి వెళితే..

మలయాళ నటి మాలా పార్వతి తన కొడుకు అనంత్ కృష్ణన్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టింది.తన కొడుకు అనంత్ ట్రాన్స్ జెండర్, మేకప్ ఆర్టిస్ట్ అయినటువంటి సీమా వినీత్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ మాలా పార్వతి తన కొడుకు పై పోలీస్ కేసు పెట్టడం గమనార్హం. అంతేకాకుండా ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.2017 లో అనంత్ తన గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడని, అసభ్యకరమైన ఫోటోలను పంపిస్తూ తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని సోషల్ మీడియా ద్వారా వివరించడంతో ఈ విషయంపై తన తల్లి స్పందిస్తూ, తన కొడుకు పై ఇలాంటి ఆరోపణలు రావడంతో కేసు పెట్టానని, ఒకవేళ నిజంగానే తప్పు చేసి ఉంటే అనుభవించాల్సిందే అని ఆమె తెలిపారు.