పుష్ప సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్.. మామూలుగా లేదుగా?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ ను విడుదల చేశారు మూవీ మేకర్. సినిమాలో ఒక పాటను అద్భుతమైన లొకేషన్ లో షూటింగ్ జరుగుతుంది అంటూ ఆ ఫోటోను విడుదల చేశారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఇందులో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా తెరకెక్కనుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది.

క్రిస్మస్ కానుకగా మొదటి భాగం పుష్ప : ది రైజ్-పార్ట్ 1 ను డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాతో షూటింగ్ లో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.