మా అధ్యక్ష అభ్యర్థిగా ప్రకాశ్‌ రాజ్‌ నామినేషన్‌ దాఖలు?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం సర్వం సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలోనే మా అధ్యక్ష అభ్యర్థిగా ప్రకాష్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాష్ రాజ్ తో పాటుగా ప్రకాష్ ప్యానెల్ సభ్యులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ నామినేషన్ పత్రాలను అందజేశారట. నేడు సివీఎల్ నామినేషన్ దాఖలు చేయనున్నారట.

 

మంచు విష్ణు సెప్టెంబర్ 28న మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మా ఎన్నికలకు సంబంధించిన ఈనెల 29 వరకు స్వీకరించనున్నారు. 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక అక్టోబర్ 1, 2 తేదీల్లో నామినేషన్ లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 10న మా ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజూ ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. ప్రకాష్ రాజ్ మెయిన్ ప్యానెల్ సభ్యులు వీరే.

1. అధ్యక్షుడు – ప్రకాశ్‌రాజ్‌
2. ట్రెజరర్‌ – నాగినీడు
3. జాయింట్‌ సెక్రటరీ : అనితా చౌదరి, ఉత్తేజ్‌
4. ఉపాధ్యక్షుడు : బెనర్జీ, హేమ
5. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ : శ్రీకాంత్‌
6. జనరల్‌ సెక్రటరీ : జీవితా రాజశేఖర్‌