హీరో సూర్య తొలి సంపాద‌న ఎంతో తెలుసా..అస్స‌లు న‌మ్మ‌లేరు!

హీరో సూర్య గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న అస‌లు పేరు శరవణన్ శివకుమార్. తమిళ సినీ నటుడు శివకుమార్ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సూర్య‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు.

Hero Surya : కరోనాను జయించిన స్టార్ హీరో సూర్య.. ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు.. | Actor suriya tests negative for covid 19 | TV9 Telugu

సూర్య త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ.. టాలీవుడ్‌లోనూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. 2006 లో హీరోయిన్ జ్యోతిక‌ను పెళ్లాడిన సూర్య‌.. ప్ర‌స్తుతం ఓవైపు వ‌రుస సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్ పుచ్చుకుంటున్న సూర్య తొలి సంపాద‌న ఎంతో తెలుసా.. రూ.736.

hats off tamil hero surya for his charity - Cinevinodam

అవును, న‌మ్మ‌స‌క్యంగా లేక‌పోయినా ఇది నిజం. సినిమాల్లోకి రాకముందు సూర్య వేరే ఉద్యోగం చేశాడు. చదువు అయిపోయిన తర్వాత నటుడిగా మారాలనే కోరిక లేకపోవడంతో ఓ ఉద్యోగంలో చేరాడు. ఓ దుస్తుల ఎగుమతుల సంస్థలో జాయిన్ అయ్యి.. రోజుకు 18 గంటల పాటు కష్టపడేవాడు. అక్కడ పనిచేసినందుకు నెల జీతంగా రూ.736 అందుకునేవాడు. అదే అత‌డి తొలి సంపాద‌న‌. అయితే కొన్నాళ్ల‌కు ఆ ఉద్యోగం అంత సంతృప్తినివ్వకపోవడంతో తండ్రి అడుగుజాడల్లోనే సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు.