పూజా హెగ్డే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..బుట్ట‌బొమ్మ ఇంట్లో సంబ‌రాలు..?!

`ముకుంద` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ప్లాపుల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ చిత్రం త‌ర్వాత పూజా హెగ్డే వెనుతిరిగి చూసుకోలేదు. వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది.

Pooja Hegde looks stunning as she channels her inner Singham. See pic -  Movies News

ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్‌, హిందీ చిత్రాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. త‌న సినిమా అప్డేట్స్‌తో పాటుగా హాట్ హాట్ ఫొటో షూట్ల‌తోనూ అల‌రించే పూజా.. ఇప్పుడు ఓ మైల్ స్టోన్‌ను అందుకుంది. తాజాగా ఇన్‏స్టాగ్రామ్‏లో ఈ బుట్ట‌బొమ్మ‌ 15 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది.

Pooja Hegde FC on Twitter: "Queen #PoojaHegde reaches the Milestone Mark 15M  Instagram Followers in a quick time ? One more Addition to the Pan Indian  Actress graph. #Beast @hegdepooja ♥️? #15MInstaFamilyForPoojahegde…

ఈ గుడ్‌న్యూస్‌ను అభిమానుల‌తో స్వ‌యంగా పంచుకున్న పూజా.. ఎంతో ఆనందంగా ఉంద‌ని చెప్పుకొచ్చింది. అలాగే తను ఈ మైలురాయికి చేరుకున్నందుకు సహాయం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు, ఈ సంద‌ర్భంగా త‌న హెయిర్ స్టైలిస్ట్, మెకప్ ఆర్టిస్ట్, కుక్, అసిస్టెంట్, కాస్ట్యూమ్ అసిస్టెంట్స్‏తో కలిసి ఇంట్లో సంతోషంగా సంబ‌రాలు చేసుకుంది. ఈ మేర‌కు ఓ వీడియోను పోస్ట్ చేయ‌గా.. ప్ర‌స్తుతం ఆ వీడియా కాస్త వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/reel/CTPV36PKHbu/?utm_source=ig_web_copy_link