మత్స్యకారుడికి అదృష్టాన్ని తెచ్చి పెట్టిన చేపలు..ఏకంగా కోట్లల్లో ..?

సాధారణంగా కొంత మంది ఎంత కష్టపడినా సరే వారికి అదృష్టం అనేది కలిసిరాక, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు.. అయితే కొంతమంది ఏం చేయకుండానే అదృష్టం కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇక అదృష్టం అనేది ఎప్పుడు ..?ఎవరిని..? ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కానీ ఒక మత్స్యకారుడు ఊహించన స్థాయిలో అదృష్టవంతుడు అయ్యాడు. అంతేకాదు ధనవంతుడు కూడా అయ్యాడు. ఏకంగా కోట్ల రూపాయల్లో లాభం వచ్చింది.. అది ఎక్కడో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

మహారాష్ట్ర రాష్ట్రంలోని ఫాల్గర్ ప్రాంతానికి చెందిన చంద్రకాంత్ తారే అనే మత్స్యకారుడు సముద్రానికి చేపల కోసం వేటకు వెళ్ళాడు. ఇక అతని వలలో అత్యంత విలువైన ఘోల్ చేపలు పడ్డాయి. ఇక ఏకంగా 157 ఘోల్ చేపలు అతని వలలో చిక్కుకున్నాయి. ఈ చేపలకు ఎందుకంత డిమాండ్ అంటే వీటిలో ఉండే ఔషధ గుణాల కారణంగా ఈ చేపలు అంత డిమాండ్ పలుకుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక దీంతో వ్యాపారులు చంద్రకాంత్ దగ్గరున్న 157 చేపలను రూ. 1.33 కోట్లకు కొనుగోలు చేశారు.