ప‌వ‌న్ బ‌ర్త్‌డే..నిప్పు కణం అంటూ చిరు ఎమోష‌న‌ల్ పోస్ట్!

అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మిగిలిన హీరోలంద‌రికీ అభిమానులు ఉంటే.. ప‌వ‌కు మాత్రం భ‌క్తులు ఉన్నారు. వారు ప‌వ‌న్ కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా వెన‌క‌డుగు వేయ‌రంటే అతిశయోక్తి కాదు.

Image

అంత‌లా కోట్లాదిమంది గుండెల్లో గూడుకట్టుకున్నారీయ‌న‌. సినిమా హీరోగానే కాదు జనసేనానిగా జనం కోసం, సమాజానికి పట్టిన బూజు దూలపడానికి న‌డుము బిగించిన ప‌వ‌న్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముకులు మ‌రియు అభిమానులు విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా త‌మ్ముడుకు బ‌ర్త్‌డే విషెస్ తెలిపుతూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు.

Image

`చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.` ట్వీట్ చేస్తూ ప‌వ‌న్‌తో దిగిన కొన్ని ఫొటోల‌ను షేర్ చేశారు చిరు. దాంతో ఈయ‌న ట్వీట్ కాస్త వైర‌ల్‌గా మారింది.

Chiranjeevi COVID-19 | Pawan Kalyan wishes South superstar Chiranjeevi a  quick recovery from COVID-19

https://twitter.com/KChiruTweets/status/1433271017758101508?s=20