మూ.. పేరుతో మరొక సరికొత్త వేరియంట్..?

కరోనా.. ఎప్పటికప్పుడు సరికొత్త రూపాంతరాలు చెందుతూ ..ప్రేక్షకులను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ప్రభావం ప్రజల బ్రతుకుల మీద ఎంతగా ఉందో తెలిసిన విషయమే..ఇకపోతే త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ గా సరికొత్తగా రూపాంతరం చెంది, ప్రజల మీద తన పంజా విసరడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజలు కరోనాకు వణికిపోతుంటే , ఇప్పుడు ఈ వైరస్ సరికొత్తగా “మూ” గా రూపాంతరం చెంది అనే పేరుతో ప్రజలను అన్ని విధాలా నాశనం చేయడానికి సిద్ధం అయ్యింది.

ఇప్పటికే దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కరోనా వేరియంట్ C.1.2 ను వైద్యులు గుర్తించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు సరికొత్తగా మూ పేరిట అందర్ని భయపెడుతోంది ఈ సరికొత్త వేరియంట్. ఈ సంవత్సరమే కొలంబియాలో ఈ వైరస్ ను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రపంచ ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇకపోతే ఈ వేరియంట్ కు ఎలాంటి టీకాలు పనిచేయని వైద్యులు స్పష్టం చేశారు.

ఇప్పటికే ప్రజలు భయాందోళనకు గురి అవుతుంటే, ఇప్పుడు సరికొత్తగా మరో వేరియంట్ రావడంతో అందరు కలవరపడుతున్నారు. ఇక ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా నుంచి సడలింపు జరుగుతున్న నేపథ్యంలో , ఇలాంటి వైరస్ వెలుగుచూడటంతో దేశం ఎలాంటి పరిస్థితుల్లో కి వెళ్తుందో చూడాలి.