జగన్ తప్పుకుంటే నేను సీఎం అవుతా..?

ఇటీవల నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే ..ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. నేను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలనలో ఏకంగా 185 కేసుల్లో పరాజయం పాలయ్యాడు.. తన తప్పుడు నిర్ణయాల వల్లే ఇలాంటి పరాజయాలు ఎదురవుతున్నాయి మొదట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తేనే.. నేను రాజీనామా చేస్తాను అంటూ ఆయన తెలిపాడు..

ఇకపోతే జగన్ బెయిల్ రద్దు కేసులో ఓడిన రఘురామ రాజీనామా చేయాలని పలువురు వైసిపి కార్యకర్తలు డిమాండ్ చేయడంతో గురువారం ఢిల్లీలో రఘురామకృష్ణ రాజు మీడియాతో మాట్లాడారు.. జగన్ బెయిలు రద్దు కోసం ఆయన పోరాటం కొనసాగుతుంది అని ఆయన తెలిపాడు.. కింది కోర్టులో ఓడిపోతే హైకోర్టులో కేసు దాఖలు చేస్తానని కూడా స్పష్టం చేశాడు.. ఏకంగా 185 కేసుల్లో ఓడినా కూడా సీఎం ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు.. నేను ఒక కేసులో ఓడిపోయిన అంతమాత్రాన నిరుత్సాహ పడాల్సిన అవసరం ఏమీ లేదు..

Raghu Rama Krishna Raju - Wikipedia

ఇప్పటికే ప్రైవేటు రెస్టారెంట్లు హోటళ్ళను అద్దెకు తీసుకొని ప్రభుత్వమే నిర్వహిస్తుండడంతో పాటు పెద్ద ఎత్తున నిరుద్యోగులకు చాలా నష్టం కలిగిస్తోంది అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు.. అంతేకాదు ప్రభుత్వం హోటల్ వ్యాపారం లో అడుగు పెట్టాలనుకోవడం, ఎంతవరకు న్యాయం..? చికెన్, మటన్ ,చేపలు, సినిమా టికెట్లు అమ్మ మంటున్నారు.. ఇప్పుడు కొత్తగా కాఫీ ,టీ, కిల్లి అంటూ హోటల్లో స్కీములు పెట్టారు.. ఇలా దిక్కుమాలిన దరిద్రపు సలహాలు ఇస్తున్న సలహాదారు ఎవరు.. వీరు పిచ్చోళ్ళు ..వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు..