బికినీ ఫొటో అడిగిన నెటిజ‌న్‌..అనుపమ అదిరిపోయే రిప్లై!

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తెర‌కెక్కించిన `అ ఆ` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ అందాల భామ‌.. శతమానం భవతి మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Anupama Parameswaran gives Onam fashion cues as she dolls up in a traditional saree; PIC | PINKVILLA

తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అనుప‌మ‌.. ఎప్పుడూ అందాల ఆర‌బోత‌కు ఆమ‌డ దూరంలో ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ త‌న‌దై అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకుంది. ఇక సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే అనుప‌మ‌.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న ఫాలోవ‌ర్స్‌తో చిట్ చాట్ చేసింది.

Anupama Parameswaran Wiki, Height, Age, Boyfriend, Family, Biography & More – WikiBio

అయితే అందులో దాదాపు రెగ్యులర్ క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ, ఓ నెటిజ‌న్ మాత్రం చిరాకు తెప్పించేలా బికినీ ఫొటో ఉండే షేర్ చేయ‌మ‌ని అనుప‌మ‌ను అడిగాడు. అందుకే అనుప‌మ స్పందిస్తూ..బికినీలో ఉన్న ఫోటో కావాలా? నీ అడ్రస్ పంపు.. నేను ఫోటోను పంపుతా.. ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకో అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చింది.

Share post:

Latest