దసరాకే ముహూర్తం.. 18 మందికి ఉద్వాసన?

అధికార వైసీపీలో మంత్రివర్గ విస్తరణపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్ లో ఉన్న వాళ్లు తమ పదవి ఉంటుందో.. ఊడుతుంద అనే ఆందోళనలో ఉంటే.. ఈసారైనా తమకు లక్ కలిసి వస్తుందా అని సీనియర్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రివర్గంలో మార్పులుంటాయని సీఎం సీటులో కూర్చున్నపుడే జగన్ చెప్పారు. ఆయన చెప్పినట్లే కచ్చితంగా చేసి తీరుతారని నాయకులు పేర్కొంటున్నారు.

విజయదసమి సందర్భంగా మంత్రివర్గంలో మార్పలుండవచ్చని తెలిసింది. ఇపుడు ఉన్న 25 మంది మంత్రుల్లో 18 మందికి ఉద్వాసన తప్పదని సమాచారం. 25 మందిలో 23 మంది ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మిగతా ఇద్దరు మాత్రం మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు వెళ్లిన తరువాత కేబినెట్ లోకి వచ్చారు. ఇదిలా ఉండగా సీఎం రెడ్డి వర్గాన్ని మాత్రం విస్మరిస్తున్నారని పార్టీలోని సీనియర్ నాయకులు అసంత్రుప్తిలో ఉన్నారట. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజాలు తమను పక్కనపెడుతున్నారని, కేవలం కులాన్ని చూసి పక్కన పెడితే ఎలా అని సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం. జగన్ అనుకున్నట్లు మంత్రులను మార్చాలనుకుంటే మాత్రం తొలగించిన మంత్రుల స్థానంలో ఆ కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యేకే అవకాశం ఇవ్వనున్నారు. అలా చేస్తే ఏ గొడవా ఉండదు.. ఆ వర్గాలు కూడా పెద్దగా బాధపడవనేది జగన్ మదిలో ఉందట. ఈ నేపథ్యంలోనే ఆయా కమ్యూనిటీ పెద్దలు, నాయకులతో జగన్ చర్చలు కూడా జరిపారని, ఎక్కడా అసంత్రుప్తి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.