వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం అంటున్న సర్వే..!

2019 లో ఆంధ్రప్రదేశ్లో చాలా రసవత్తరంగా ఎన్నికలు జరిగాయి. అక్కడ వైఎస్ఆర్సిపి 151 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. దీనికి జగన్ మీద నమ్మకంతోనే, ఆయన చెప్పినట్టు వంటి పథకాలు, ప్రజలను ఆకర్షించడంతో ప్రజలు జగన్ కి అక్కడ పట్టం కట్టారు.ఇక ఇప్పుడు అదే ప్రజలకు శాపంగా మారినట్టు తెలుస్తోంది. జగన్ పాలన పై ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారట.

అయితే ఇప్పుడు తెలిపిన తాజా సర్వే ప్రకారం ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషనల్ పోల్ లో సీఎం జగన్ 11 rank రావడం జరిగింది. కేవలం 6 శాతం మంది మాత్రమే జగన్ బెస్ట్ సీఎం అన్నారంటే ఆయన గ్రాఫ్ ఏరేంజిలో పతనమైన మనం అర్థం చేసుకోవాల్సింది.ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా లోకల్ యాప్ సర్వే మరింత షాకింగ్ రిజల్ట్ ను బయటపెట్టింది. ఆ సర్వేలు జగనన్న గెలుపు అంచున వేలాది ఓటమి వైపు జారిపోయారు అన్నట్లుగా చూపుతోంది. అక్కడ వైసీపీతో టీడీపీ పోటీ పడి ఒక్క శాతం ఓటింగ్తో విజయం కైవసం చేసుకోవడం సంచలనంగా మారింది. ఒకప్పుడు జగన్ కేవలం ఒక్క ఛాన్స్ తో సీఎం కాక.. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు కూడా ఆ ఒక్క ఛాన్స్ తో గట్టెక్కుతారు అని లోకల్ సర్వేలు తేల్చి చెప్పింది.

రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఎక్కువగా జనాలు టిడిపికి వస్తుందని 44% మంది చెప్పగా వైసిపి 43% అని తెలిపింది. ఇక బీజేపీ జనసేన 13.05% శాతం మంది వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలలో టిడిపి 37 శాతం ఓట్లు ని సంపాదించింది. కానీ వైసిపి గతంలో 51 శాతానికి పైగా ఓట్లు సంపాదించడం గమనార్హం. ఇక ఈ మధ్య డిఫరెన్స్ చూస్తే 14 శాతం ఓటింగ్ ను చేజిక్కించుకుంది అప్పట్లో వైసిపి. కానీ ఇప్పుడు చేసుకుంటే తాజా సర్వేలో టిడిపినే మొదటి స్థానం ఉన్నట్లు తేలింది.

అంతేకాకుండా రాబోయే రోజుల్లో వైసిపి ఓట్ల శాతం మరింత తక్కువగా ఉండొచ్చని సర్వే నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకు కారణం ఏమిటంటే, కష్టపడి పనిచేసిన వారికి ఆ పార్టీ కోసం గుర్తింపు లేకుండా చేయడం, కేవలం బలహీన వర్గాల వారికి ఎక్కువగా చేయడం పనులు, నిరుద్యోగులకు ఉద్యోగులు వదలక పోవడం. ఇవన్నీ కాకుండా మరికొన్ని కూడా సీఎం క్రాఫ్ పడిపోవడానికి కారణాలుగా చెప్పవచ్చు.