ఆ రేసు కారును ముందుగా పట్టుకొస్తున్నది తారక్!

యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన కార్ల కంపెనీ లంబోర్ఘిని రోజుకో కొత్త మోడల్ కారుతో ప్రపంచవ్యాప్తంగా యువతతో పాటు లగ్జరీ ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ జాబితాలో లంబోర్ఘిని కంపెనీ నుండి కొత్తగా వస్తున్న ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్ మోడల్ కారుకు అప్పుడే ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది. అతి తక్కువ ఎడిషన్‌లతో వస్తున్న ఈ కారును ఇండియన్ మార్కెట్‌లోకి కూడా వదలబోతుంది ఆ కంపెనీ. అయితే ఈ కారును ఇండియాలో కొనబోయే తొలి వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా అవాక్కవుతారు.

లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్ మోడల్ కారును ఇండియాలో కొనబోయే తొలి వ్యక్తి యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మేరకు ఆ కంపెనీ అధికారిక ప్రకటన కూడా చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రేసు కార్లకు కేరాఫ్‌గా ఉండే ఈ కంపెనీ నుండి వస్తున్న ఈ కొత్త కారును అత్యంత భారీ రేటుకు తారక్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కారు కేవలం 3.6 సెకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకోవడం విశేషం. గంటకు 305 కిమీ వేగంగా ఈ కారు రోడ్లపై దూసుకెళ్లగలదు.

రేసు కార్లు, బైకులు అంటే ఎంతో ఇష్టపడే తారక్ ఈ కారును ఇండియాలోనే సొంతం చేసుకున్న తొలి వ్యక్తిగా రికార్డు కొట్టాడు. ఇక ఈ కారు కోసం ఆయనకు ఎంతగానో నచ్చే 9999 నెంబర్ రిజిస్ట్రేషన్‌ను చేయించేందుకు తారక్ రెడీ అవుతున్నాడు. మరి ఈ కారును ఆయన పబ్లిక్ ముందుకు ఎప్పుడు తీసుకొస్తాడో చూడాలి.