విజ‌య్ `బీస్ట్‌` సెట్స్‌లో సంద‌డి చేసిన ధోనీ..పిక్స్ వైర‌ల్‌!

August 12, 2021 at 5:30 pm

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం `బీస్ట్‌`. విజయ్‌ 65వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

 కొన్ని యాడ్స్ షూటింగ్స్ కోసం స్టూడియో కు వెళ్లిన ఎంఎస్ ధోని.., పక్కనే ఇళయ దళపతి విజయ్ బీస్ట్ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లి అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు.

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని గోకుల్ స్టూడియోస్ లో జ‌రుగుతోంది. అయితే టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బీస్ట్ సెట్స్‌లో సంద‌డి చేశాడు. సెప్టెంబర్ 10వ తేదీ ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో చెన్నై వ‌చ్చిన ధోని.. కొన్ని యాడ్స్ షూటింగ్స్ కోసం గోకుల్ స్టూడియోస్ వెళ్లారు.

MS Dhoni visits Vijay on Beast sets విజయ్ బీస్ట్ సెట్స్ లో టాప్ క్రికెటర్  ధోని

అయితే దళపతి విజయ్ బీస్ట్ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న ధోని.. అక్కడికి వెళ్లి అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు. షూటింగ్ స్పాట్ కు వెళ్లిన ధోనీకి విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. అనంత‌రం ఇరువురూ కాసేపు ముచ్చ‌ట్లు పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Thala Dhoni meets Thalapathy Vijay - double charismatic photo erupts the  internet - Tamil News - IndiaGlitz.com

MS Dhoni visits Vijay on Beast sets, see photos | Entertainment News,The  Indian Express

Thala Dhoni meets Thalapathy Vijay - double charismatic photo erupts the  internet - Tamil News - IndiaGlitz.com

విజ‌య్ `బీస్ట్‌` సెట్స్‌లో సంద‌డి చేసిన ధోనీ..పిక్స్ వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts