నాన్న‌కు దూరంగా మంచు మ‌నోజ్‌..ఆ విష‌యాల‌న్నీ చెప్పేసిన విష్ణు!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మ‌నోజ్.. ఆయ‌న తండ్రి, టాలీవుడ్ కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుకు దూరంగా ఉంటున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌నోజ్ అన్న మంచు విష్ణునే తెలిపాడు. తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్న టాలీవుడ్ హీరో, నిర్మాత మంచు విష్ణు.. వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం షేర్ చేసుకున్నాడు.

Mohan Babu Age And Height

అలాగే త‌న‌కు, త‌మ్మ‌డు మంచు మ‌నోజ్‌కు మ‌ధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయ‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా విష్ణు క్లారిటీ ఇచ్చాడు. తనకు తమ్ముడికి మద్య ఎటువంటి ఆస్తి తగాదాలు లేవ‌ని, మాపై వ‌స్తున్న వార్త‌లు కేవ‌లం పుకార్లే అని విష్ణు తేల్చేశారు.

Manchu Vishnu family photos | Celebrity family wiki

ఈ క్ర‌మంలోనే అక్క లక్ష్మి వేరుగా ఉంటుంది. అలాగే తమ్ముడు మనోజ్ కూడా వేరుగానే ఉంటున్నాడు. నేను మాత్రం అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్నా అని విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే మ‌నోజ్ ఎందుకు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడ‌న్న‌ది మాత్రం విష్ణు తెలప‌లేదు. దాంతో ఇప్పుడీ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.