కార్లతో.. పోటీపడుతున్న.. ఎన్టీఆర్…రామ్ చరణ్.. వీడియో వైరల్..?

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం RRR ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం ఈ రోజు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

- Advertisement -

ఇక ఈ సినిమాలో సముద్రకని, శ్రీయ, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ కీలకపాత్రలో నటిస్తూండగా ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కూడా తెరకెక్కబోతోంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానున్నట్లు సమాచారం.

అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా నేటితో పూర్తి కావడంతో తమ సినిమాల్లో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా తమ సొంత కారులో ఇంటికి వేగంగా దూసుకుని వెళ్తున్న వీడియో ని RRR చిత్ర యూనిట్ సభ్యులు తమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో కాస్త వైరల్ గా మారుతుంది.https://twitter.com/RRRMovie/status/1430865888329170947?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1430865888329170947%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fcdn.embedly.com%2Fwidgets%2Fmedia.html%3Ftype%3Dtext2Fhtmlkey%3Dfd92ebbc52fc43fb98f69e50e7893c13schema%3Dtwitterurl%3Dhttps3A%2F%2Ftwitter.com%2Frrrmovie%2Fstatus%2F1430865888329170947image%3Dhttps3A%2F%2Fabs.twimg.com%2Ferrors%2Flogo46x38.png

Share post:

Popular