బిగ్ బ్రేకింగ్: ఎట్టకేలకు భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతాకం..!

వంద కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో ఎంతోమంది వారి ప్రతిభను చాటడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం జపాన్ దేశంలో జరుగుతున్న టోక్యో ఒలంపిక్స్ లో భాగంగా భారత్ తన మొట్టమొదటి స్వర్ణ పతాకాన్ని ముద్దాడింది. తాజాగా జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్లో భాగంగా తొలి ప్రయత్నంలోనే భారత్ కు చెందిన నీరజ్ చోప్రా ఏకంగా 87.58 మీటర్ల దూరంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మీరా చోప్రా తన మొదటి ప్రయత్నంలో 87.03 మీటర్ల దూరం విసరగా.. రెండో ప్రయత్నంలో ఏకంగా తన కెరీర్ బెస్ట్ గా 87.58 మీటర్ల దూరం విసరడంతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక తన మూడో ప్రయత్నంలో కేవలం 76.99 మీటర్లు మాత్రమే విసర కలిగాడు నీరజ్ చోప్రా.

నీరజ తన 4, 5 ప్రయత్నాలలో ఫౌల్ చేశాడు. అయితే ఎట్టకేలకు స్వర్ణ పతకం సాధించడంతో భారతదేశంలో సంబరాలు మొదలయ్యాయి. దేశంలోని ప్రధాన వ్యక్తులు అందరూ నీరజ్ చోప్రా ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.