అంగన్వాడీ , మినీ అంగన్వాడీ పోస్టులు విడుదలా..?

ప్రస్తుతకాలంలో ప్రభుత్వ ఉద్యోగాల మీద అందరి దృష్టి ఉంది. ఇక ఈ ఉద్యోగం పొందాలంటే తీవ్రమైన కఠోర శ్రమతో చదివితే కానీ , ఉద్యోగం వచ్చేలా కనిపించడం లేదు. అయితే కరోనా సమయం తర్వాత, ముఖ్యంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వాలు తెలుపుతూ వచ్చాయి. అలాంటి వాటిలోనే ఏపీ ప్రభుత్వం.. కొన్ని పోస్ట్ లను విడుదల చేస్తోంది.. ఆ వివరాలు చూద్దాం.

కర్నూల్ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి, మినీ అంగన్వాడీ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది.. కర్నూలు జిల్లా అధికారి ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఇక ఇందులో అంగన్వాడి వర్కర్ పోస్టులు 44 ఉండగా, మినీ అంగన్వాడీ వర్కర్స్-2, మరియు 310 అంగన్వాడి ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేసింది. వీటికి 10 వ తరగతి అర్హతతో కేవలం మహిళలకు మాత్రమే దరఖాస్తు తీసుకునే విధంగా ఆహ్వానాన్ని వెల్లడించింది.

ఈ మూడు పోస్టులు కూడా కేవలం పదో తరగతి తోనే ఉద్యోగం పొందవచ్చు. ఇక ఇందుకు గల వయసు..1-7-2021 నాటికి ,21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలలోపు వయస్సున్న వారు అర్హులు. ఖాళీల వివరాలను పూర్తి చేసి కర్నూలు జిల్లాలోని icds కార్యాలయంలో అప్లికేషన్ ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది కేవలం ఆయా జిల్లాలలో ఉన్న వారు మాత్రమే పోస్ట్ లను బట్టి అప్లికేషన్ వేసుకోవాలి.

పూర్తి వివరాల కోసం icds పైన క్లిక్ చేసి, చూసుకోవచ్చు.