ఆ సినిమా కోసం ప్రేమదేశం కాంబో రిపీట్!

మ్యూజికల్ లవ్ స్టోరీస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్, అలాగే దర్శకుడు కదిర్ ఈ కాంబినేషన్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్ దాదాపుగా రెండు దశాబ్దాల తరువాత మరొకసారి రిపీట్ కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేమ దేశం, ప్రేమికుల రోజు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అందించారు. ఇక 2002లో వచ్చిన కాదల్ వైరస్ సినిమా తరువాత మరి ఈ సినిమాకు దర్శకత్వం వహించే లేదు కదిర్. ఇకపోతే అబ్బాస్, హీరా, కునాల్, శ్రీదేవి విజయ్ కుమార్ లాంటి విద్యావంతులైన తారలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కదిర్ నే అన్న విషయం అందరికి తెలిసిందే.

అయితే చాలా రోజుల తర్వాత మరొక సినిమాకు దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు కదిర్. అలాగే ఈ సినిమాకు సంగీతాన్ని అందించడానికి కూడా ఏ ఆర్ రెహమాన్ ను ఉంచుకున్నారు. అయితే గత కొంతకాలంగా తనకు దర్శకత్వం ఆఫర్లు వస్తూనే ఉన్నాయ్ అని, అయితే ఇప్పటికీ అన్ని కుదిరాయని, సంగీత ప్రధానమైన ప్రేమ కథ చిత్రం కావడంతో ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ అయితే బాగుంటుంది అని అనుకున్నాను అని కదిర్ తెలిపారు.