బిగ్‌బాస్ సీజ‌న్ 5: హోస్ట్‌గా చేయ‌న‌న్న రానా..కార‌ణం అదేన‌ట‌!?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్ల‌ను పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకెండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే.. ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజ‌న్ 5 కూడా స్టార్ట్ అయ్యి ఉండేది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ ఐదో సీజ‌న్ సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తి అయింద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్ హోస్ట్‌గా నాగార్జున చేయ‌డం లేద‌ని, ఆయ‌న ప్లేస్‌లో ద‌గ్గుబాటి వార‌బ్బాయి ద‌గ్గుబాటి రానా వ‌స్తున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, రానాకు బిగ్ బాస్ నిర్వాహ‌కులు భారీ రెమ్యున‌రేష‌న్ కూడా ఆఫ‌ర్ చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయిత తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. బిగ్ బాస్ హోస్ట్‌గా చేయ‌న‌ని చెప్పాడ‌ట రానా. సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ షో చేయలేనని, అంతేగాక బిగ్‌బాస్‌ లాంటీ షో చేయడం అంటే కాస్త రిస్క్‌తో కూడుకుందని భావించి రానా.. ఈ ఆఫ‌ర్‌కు నో చెప్పాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇదే నిజ‌మైతే.. సీజ‌న్ 5కు హోస్ట్‌గా ఎవ‌రొస్తారు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.