నాగ్-అమ‌ల పెళ్లి త‌ర్వాత అంత క‌థ న‌డిచిందా?

సీనియర్ న‌టుడు అక్కినేని నాగేశ్వర‌రావు న‌ట వారసుడు గా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున‌. తండ్రి తగ్గ తనయుడుగా ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్న నాగ్‌.. వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే మొద‌ట‌ ఈయ‌న ద‌గ్గుబాటి వెంక‌టేష్ సోద‌రి ల‌క్ష్మిని వివాహం చేసుకున్నాడు. నాగ చైత‌న్య జ‌న్మించిన త‌ర్వాత.. ఈ దంప‌తులు ప‌లు కార‌ణాల వ‌ల్ల విడాకులు తీసుకున్నారు.

ఆ త‌ర్వాత నాగార్జున హీరోయిన్ అమ‌ల‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఈ పెళ్లి నాగేశ్వ‌ర‌రావునే ఏ మాత్రం ఇష్టం లేదు. అయితే ప్రతీ విషయంలో తండ్రి మాట జ‌వ‌దాట‌ని నాగార్జున.. త‌న రెండో పెళ్లి విష‌యంలో మాత్రం ఎదురు నిలబడ్డాడట‌. ప్రేమ పెళ్లి వద్దని నాగేశ్వ‌ర‌రావు చెప్పినా కూడా వినకుండా పెళ్లి చేసుకున్నాడట.

తన మాట వినకుండా పెళ్లి చేసుకున్నందుకు.. నాగేశ్వ‌ర‌రావు నాగార్జున‌ను దూరం పెట్టేశాడ‌ట‌. క‌నీసం మాట‌ల కూడా ఉండేవి కావ‌ట‌. అయితే ఒక‌రోజు సినీ నటుడు మురళీ మోహన్ నాగేశ్వర్ రావుతో కొడుకుని దూరం చేసుకోవద్ద‌ని స‌ర్దిచెప్ప‌డంతో.. మ‌న‌సు మార్చుకుని నాగ్‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకున్నార‌ట‌. అలాగే అమ‌ల‌ను అక్కినేని ఇంటికి కోడ‌లిగా అంగీక‌రించార‌ట‌.