మాస్క్ లేకుండా బయటికి వచ్చిన రష్మిక… కానీ..?

అందాల తార రష్మిక మందన్నా ఓ పొరపాటు చేసింది. అసలేంటీ బ్యూటీ చేసిన పొరపాటు అని కంగారు పడుతున్నారా… మాస్కు లేకుండా ఈ ముద్దు గుమ్మ ఫొటోలకు ఫోజిచ్చింది. వెంటనే తేరుకుని తాను మాస్కు ధరించలేదని కంగారు పడింది.

అసలేం జరిగిందంటే… కన్నడ బ్యూటీ రష్మక ప్రస్తుతం ముంబైలో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది. తాజాగా ఆ చిత్ర షూటింగ్ కోసం ముంబైకి వెళ్లినపుడు రష్మికను ఫొటోలకు ఫోజులివ్వమని ఫొటోగ్రాఫర్లు అడగ్గా… ఈ బ్యూటీ తన కారు వద్ద నిల్చొని ఫొటోలకు ఫోజులిస్తోంది. అయితే తాను మాస్కు ధరించడం మరిచిపోయానని గుర్తించిన ఈ చిన్నది క్రేజీ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. దీనిని విరాల్ బియాని అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… వైరల్ గా మారింది. ఈ అమ్మడు కంగారును చూసిన నెటిజన్లు మాస్కులు లేకుండా తిరిగే సెలబ్రెటీలను తెగ ట్రోల్ చేస్తున్నారు.