ఢిల్లీ చుట్టూ చక్కర్లు.. అయినా రాలని కాసులు..

ఏపీ ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నెలకు ఒకటి, రెండు సార్లు హస్తినకు వెళ్లి వస్తున్నారు. ఆయన సమయమంతా ఢిల్లీకి వెళ్లి రావడానికే సరిపోతుంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థి బాగాలేదు.. నిధులు ఇవ్వండి అని కేంద్రప్రభుత్వాన్ని అడగడానికి, వినతిపత్రాలు ఇవ్వడానికి నిత్యం హస్తినకు వెళుతున్నారు. అయితే డిల్లీ పెద్దలు మాత్రం స్పందించడం లేదు. బుగ్గన పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్ర మంత్రులను కలిస్తే చాలురా దేవుడా.. అనే పరిస్థితి వచ్చింది.

గతంలో ఓ సారి కనీసం కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదని తెలిసింది. సంక్షేమ పథకాల పేరిట డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని, అప్పులు ఎక్కువ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని సమాచారం. కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, గజేంద్ర షెకావత్, సర్బానంద సోనోవాల్, కిరణ్ రిజ్జు తదితరులను కలవడానికి ప్రయత్నించారని, వీలు కాలేదని తెలిసింది. అయితే అధికారికంగా ఈ సమాచారం బయటకు రావడం లేదు. కేంద్రం నంచి కొత్త రుణాలు పొందేందుకు బుగ్గన యత్నిస్తుంటే..కేంద్రం వద్ద ఈ పప్పులేం ఉడకడం లేదు. పాపం.. బుగ్గన డబ్బులెలా తెస్తాడో ఏమో..!