దేశంలో 40 వేలకు దిగువగా కరోనా కేసులు..మ‌రణాలెన్నంటే?

July 5, 2021 at 10:11 am

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు త‌గ్గ‌గా.. మ‌ర‌ణాలు మ‌రింత పెరిగాయి.

గ‌త 24 గంటల్లో భారత్‌లో 39,796 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,85,229 కు చేరుకుంది. అలాగే నిన్న 723 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,02,728 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 42,352 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 2,97,00,430 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 4,82,071 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

దేశంలో 40 వేలకు దిగువగా కరోనా కేసులు..మ‌రణాలెన్నంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts