సీఎంకు చుర‌క‌ల అంటించిన `గృహలక్ష్మీ` నటి..ఏం జ‌రిగిందంటే?

July 5, 2021 at 9:52 am

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన‌ నటి కస్తూరి శంకర్.. ప్ర‌స్తుతం గృహలక్ష్మీ సిరియల్ ద్వారా బుల్లితెర‌ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే క‌స్తూరి.. సామాజిక అంశాలపై, రాజకీయ విషయాలపై త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంది.

Rs 4,000 per family, free bus travel for women: The first 5 orders signed by TN CM Stalin | The News Minute

మొన్నీ మ‌ధ్య వైద్యం నిమిత్తం అమెరికాకును వెళ్లిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన క‌స్తూరి.. ఇప్పుడే ఏకంగా సీఎంకు చుర‌క‌లు అంటించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..తమిళనాడు సీఎం స్టాలిన్ నేడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉదయం పూట సైకిల్ తొక్కుతూ.. ప్రజల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. వాట‌పై కస్తూరి స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `ఎంకే స్టాలిన్ ఓ రాక్ స్టార్.. అద్భుతమైన సీఎం.. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే. కానీ సీఎం సర్ ప్రజలలోకి ఇలా వచ్చినప్పుడు మాస్క్ ధరించండి. మీ ఫోటోలతో మాస్క్ పై అవగాహన కల్పించండి` ట్వీట్ చేసి చురకలు అంటించింది. దాంతో క‌స్తూరీ ట్వీట్ కాస్త వైర‌ల్‌గా మారింది.

సీఎంకు చుర‌క‌ల అంటించిన `గృహలక్ష్మీ` నటి..ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts