తేజ డైరెక్ష‌న్‌లో దగ్గుబాటి హీరో డెబ్యూ మూవీ..ఇంట్ర‌స్టింగ్‌గా టైటిల్‌?!

ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు, ద‌గ్గుబాటి రానా త‌మ్ముడు అభిరామ్ దగ్గుబాటి టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్ప‌టి నుంచో ర‌క‌ర‌కాలు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు ఈయ‌న డెబ్యూ మూవీకి రంగం సిద్ధ‌మైంది.

తేజ దర్శకత్వంలో అభిరామ్ తొలి చిత్రం ఆదివారం రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై జెమిని కిరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ స్టార్ట్ కానుంద‌ని తెలుస్తోంది.

ఇక డెబ్యూ హీరోలతో ప్రేమ కథా చిత్రాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న తేజ‌.. అభిరామ్‌తో మాత్రం సోషల్ మెసేజ్ ఉన్న సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. అంతేకాదు, ఈచిత్రానికి అహింస అనే ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారట‌.