ర‌జ‌నీకాంత్ సినిమాకు చిరు టైటిల్‌..?!

సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ మూవీలో న‌య‌న‌తార‌, కీర్తి సురేశ్‌, మీనా, జ‌గ‌ప‌తిబాబు, కుష్బూ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ చిత్రం కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఎన్నో అవాంతరాలు, వాయిదాలు దాటుకుంటూ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 4న రిలీజ్ కానుంది. అయితే త‌మిళంలో అన్నాత్తే పేరుతో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌తో విడుద‌ల చేయానున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా వ‌చ్చిన `అన్న‌య్య` సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ టైటిల్‌నే ర‌జ‌నీ అన్నాత్తే కు ఖరారు చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. అన్నాతే అంటే అన్న‌య్య అని అర్థం. పైగా ర‌జ‌నీ ఇమేజ్‌కు కూడా ఈ టైటిల్ బాగా సూట్ అవుతుంద‌ని..అందుకే దానిని ఫిక్స్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. మ‌రి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.