దానికి బానిస అయిపోయిన అనుపమ..నెట్టింట న్యూస్ వైర‌ల్‌!

`అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ పరమేశ్వరన్‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే అందం, అభినయం, త‌న‌దైన న‌ట‌నతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంది. ప్ర‌స్తుతం ఈ కేరళ బ్యూటీ.. నిఖిల్ సరసన 18పేజెస్, దిల్ రాజు బ్యానర్ లో ఆయన తమ్ముడు కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న రౌడీ బాయ్స్ చిత్రంలో న‌టిస్తోంది.

Anupama Parameswaran Turns 25: Stylish Pics Of This Tollywood Beauty

ఇదిలా ఉండే.. సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ‌.. ఇటీవ‌ల త‌న ల‌వ్‌, బ్రేక‌ప్ గురించి చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాలో `గిబ్బరిష్‌` గేమ్‌కు బానిసలా మారిపోయినట్లు తెలిపింది.

Anupama

ఈ ఆటలో కొన్ని వెరైటీ పదాలను ఇస్తారు. మనం పలికే తీరును బట్టి నిజమైన ఆంగ్ల పదాలను కనిపెట్టవచ్చు. ఈ గేమ్‌కు ఫిదా అయిన‌ అనుపమ.. తేగ ఆడేస్తుంది. ఈ క్ర‌మంలోనే దానికి బానిసగా మారిపోయింది.