హైదరాబాద్‌లో ఇల్లు కొన్న సోనూసూద్‌..ఎన్ని కోట్లో తెలుసా?

సోనూసూద్‌.. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత దేశ‌మంత‌టా మారుమోగిపోతున్న పేరు ఇది. క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో వలస కార్మికులకు అండగా నిలిచాడు. తన‌ సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు పంపాడు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో సాయ‌ప‌డి ఆపద్భాందవుడిగా మారాడు.

ఈ క్ర‌మంలోనే సోనూసూద్ క్రేజ్ తారా స్థాయికి పెరిగి పోయింది. దాంతో ఆయన క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకోవాలని తెగ‌ ఆరాటపడుతుండ‌డంతో.. సోనూసూద్‌కు అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా వ‌స్తుండ‌డంతో.. ఆయ‌న హైదరాబాద్‌లోనే ఉండాల్సి వస్తుంది.

Actor Sonu Sood withdraws plea from SC against HC order on 'illegal'  construction | Cities News,The Indian Express

ఈ నేప‌థ్యంలోనే సోనూసూద్ హైద‌రాబాద్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. తెలుగులో ఎక్కువగా ఆఫర్లు వస్తోన్న కారణంతోనే బంజారాహిల్స్‌లో సోనూ రూ.10 కోట్లు ఖ‌ర్చు పెట్టి ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేశార‌ట‌. అంతేకాదు, త్వ‌ర‌లోనే కొత్త ఇంటిలోకి గృహ‌ప్ర‌వేశం కూడా చేయ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.