మెరూన్ ఫ్రాక్ లో మ‌తిపోగొడుతున్న అన‌సూయ‌..పిక్స్ వైర‌ల్‌!

ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ యాంక‌ర్‌గా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది అనసూయ భరధ్వాజ్. ఆ క్రేజ్‌తోనే మ‌రిన్ని టీవీ షోల‌తో పాటు సినిమాల్లోనూ అవ‌కాశాలు ద‌క్కించుకుని వెండితెర‌పై సైతం స‌త్తా చాటుతోంది ఈ బ్యూటీ.

బుల్లితెరపై అనసూయ తీరు ఆమెకు భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. వెండితెరపై నటిగా ఎదగడానికి ఆ ఇమేజ్ కారణం అయ్యింది. ప్రస్తుతం అనసూయ చేతినిండా సినిమాలే. తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు వెబ్ సిరీస్లు, సినిమాలు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోల‌కు హోస్ట్ చేస్తున్న అనసూయ..రంగమార్తాండ, పుష్పతో పాటు త‌దిత‌ర చిత్రాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనూ.. హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కాక రేపుతుంటుంది.

తెలుగులో పుష్ప, ఖిలాడి, రంగమార్తాండ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. పుష్ప రెండు పార్ట్స్ గా పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతుండగా అనసూయ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

తాజాగా మెరూన్ క‌ల‌ర్ ఫ్రాక్ ధ‌రించి కిర్రాక్ పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌తిపోగొడుతున్న అన‌సూయ అందాల‌కు అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. మ‌రి అనసూయ లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

ఇక సోషల్ మీడియాలో అనసూయ ఫోటో షూట్స్ ఫ్యాన్స్ కి ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి.  ట్రెండీ డ్రెస్ లలో క్రేజీ ఫోజులిస్తూ ఆమె చేసే ఫోటో షూట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు.

ఇక అనసూయ బట్టలు, డ్రెస్సింగ్ స్టయిల్ పై అనేక మార్లు విమర్శలు తలెత్తాయి. తన పొట్టిబట్టలపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఐ డోంట్ కేర్ అంటారు ఆమె. వృత్తి పరంగా తప్పదనే అనసూయ, విమర్శలకు గట్టి కౌంటర్లు ఇచ్చిన సందర్భాలు అనేకం.

టెలివిజన్ ప్రేక్షకులకు అనసూయ అందాలు కొత్త అనుభూతిని పంచాయి. యాంకర్ అంటే ఇలానే ఉండాలనే పద్దతి బ్రేక్ చేసి, జబర్దస్త్ షోలో పొట్టిబట్టలలో రచ్చ చేసింది. ఒకవైపు నాన్ స్టాప్ కామెడీ, మరోవైపు అనసూయ మెస్మరైజింగ్ బ్యూటీ... ఆ షోని ఎక్కడికో తీసుకెళ్లింది.

సాలిడ్ అందాలతో పోతపోసినట్లు ఉండే ఈ పొడుగు సుందరి, అందంతో బుల్లితెర పరిశ్రమను ఏళ్లుగా ఏలేస్తుంది. న్యూస్ రీడర్ గా బుల్లితెరకు పరిచయమై జబర్దస్త్ వేదిక ద్వారా సూపర్ పాప్యులర్ అయ్యారు.

 

Share post:

Latest