వామ్మో..`ఆర్ఆర్ఆర్‌`లో ఆలియా సాంగ్‌కే అన్ని కోట్లా?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న ఈ మ‌ల్టీస్టార‌ర్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో భాలీవుడ్ భామ ఆలియా భ‌ట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..ఆలియా భట్ మీద ఈ భారీ బడ్జెట్ పాటను చిత్రీకరించనున్నారట.

ఈ సాంగ్‌ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో తీయ‌నున్నార‌ట‌. అయితే ఈ సాంగ్‌కు ఏకంగా రూ.3 కోట్లు ఖర్చు పెడుతున్నార‌ట‌. అందులోనూ ఆలియా కాస్ట్యూమ్స్‌ కోసమే దాదాపు రూ.కోటి ఖర్చు చేస్తునట్టు తెలుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో ప‌క్క‌న పెడితే.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైర‌ల్‌గా మారింది.