బుల్లితెర ఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్న త‌మ‌న్నా..త్వ‌ర‌లోనే..?

June 16, 2021 at 8:38 am

త‌మ‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి ప‌దిహేను సంవ‌త్స‌రాలు దాటిపోయినా.. ఈ అమ్మ‌డు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతూనే ఉంది. ప్ర‌స్తుతం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ల‌తోనూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న ఈ చిన్న‌ది బుల్లితెర‌ను కూడా వ‌దిలి పెట్ట‌డం లేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. త్వ‌ర‌లోనే బుల్లితెర ఎంట్రీకి త‌మ‌న్నా సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారం కానున్న వంటల ప్రోగ్రాంకి తమన్నా జడ్జిగా వ్యవహరించనున్నారట.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించి ప్రణాళికలు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రి నిజంగానే త‌మ‌న్నా బుల్లితెర‌పై కూడా అడుగు పెడితే.. ఆమె అభిమానుల‌కు పండ‌గ‌నే చెప్పాలి.

బుల్లితెర ఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్న త‌మ‌న్నా..త్వ‌ర‌లోనే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts