బోయ‌పాటి నెక్స్ట్‌ ఆ కోలీవుడ్ స్టార్ హీరోతో ఫిక్స‌ట‌?!

June 16, 2021 at 8:17 am

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బోయ‌పాటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

కానీ, పుష్ప కార‌ణంగా బ‌న్నీ ఇప్ప‌ట్లో ఫ్రీ అయ్యే ప‌రిస్థితి లేదు. అందుకే బోయ‌పాటి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌ను లైన్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. పక్కా మాస్ మసాలా స్టోరీని సిద్ధం చేసి.. ఇటీవ‌లె సూర్య‌కు వినిపించాడ‌ట బోయ‌పాటి. అది బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే సినిమా చేసేందుకు సూర్య గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ట‌.

ఈ సినిమాతో తెలుగుతో పాటు త‌మిళంలోనూ తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. అంతేకాద‌, ఈ చిత్రానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Happy Birthday Suriya: 5 Action Films of the Actor You Can't Miss

బోయ‌పాటి నెక్స్ట్‌ ఆ కోలీవుడ్ స్టార్ హీరోతో ఫిక్స‌ట‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts