గ‌ర్భ‌వ‌తిగా ప్రియ‌మ‌ణి..ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న బ్యూటీ?!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. సౌత్‌ ఇండియన్‌ సినిమాల్లో యాక్ట్‌ చేస్తూ వన్‌ ఆఫ్ ది టాలెంటెడ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ‌..ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ప్రియమణి మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా మారిపోయారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రియమణికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ప్రియ‌మ‌ణి త‌న అభిమానుల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్ప‌బోతోంద‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ బ్యూటీ ఓ కొత్త ప్రాజెక్ట్‌ను సైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. గతేడాది కన్నడలో యాక్ట్ 1978 అనే చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. మన్సోరే డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో యజ్ఞ శెట్టి ప్ర‌ధాన పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఇందులో ప్రియ‌మ‌ణి న‌టించ‌బోతోంద‌ట‌. అది కూడా గ‌ర్భ‌వ‌తి పాత్ర‌లో.

ప్రభుత్వం నుండి తనకు రావాల్సిన డబ్బు కోసం రోజూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ విసిగిపోయిన ఓ గర్భిణీ స్త్రీ తన కడుపుకి బాంబ్ చుట్టుకొని గవర్నమెంట్ ఆఫీసును లాక్ చేసి.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుందనేది సినిమా. ఎంతో ఇంట్ర‌స్టింగ్‌గా సాగే ఈ క‌థ‌కు ప్రియ‌మ‌ణి తోడైతే.. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌రే అంటున్నారు అభిమానులు.