అర‌రే..సినిమా స్టార్ట్ కాక‌ముందే బెల్లంకొండకు రూ. 3 కోట్లు న‌ష్ట‌మా?!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ మూవీ ద్వారా ఇటు బెల్లంకొండ, అటు వినాయక్ ఇద్దరూ బాలీవుడ్‌కి పరిచయం అవ్వబోతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌క‌ముందే ఈ చిత్రానికి భారీ న‌ష్టం వాటిల్లింది. అవును, ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు.. ఆ మ‌ధ్య ఆరు ఎకరాల్లో రూ. మూడు కోట్ల వ్యయంతో విలేజ్‌ సెట్ వేశార‌ట‌. ఇక‌ ఏప్రిల్‌ 22న షూటింగ్‌ ఆరంభం కావాల్సి ఉండగా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది.

అయితే ఈలోపు అకాల వర్షాల వల్ల ఈ సెట్‌ బాగా దెబ్బతింద‌ట‌. దీంతో నిర్మాత‌ల‌కు రూ.3 కోట్లు వ‌ర‌కు న‌ష్టం వాటిల్లిన‌ట్టు స‌మాచారం. ఇక ప్ర‌స్తుతం డ్యామేజ్ అయిన ఆ సెట్టును మ‌ళ్లీ సెట్ చేసే ప‌నిలో ప‌డ్డార‌ట మేక‌ర్స్‌.

Share post:

Latest