తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేత..కార‌ణం అదే!

ప్రస్తుతం సెకెండ్ వేవ్ క‌రోనా శ‌ర‌వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా స్వ‌యంవిహారం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా సంభ‌విస్తున్నాయి.

అయితే ఇలాంటి త‌రుణంలో తెలంగాణ స‌ర్కార్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నిలివివేసింది. కొవిషీల్డ్ తీసుకునే వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్పులు చేసింది.

తొలి డోసుకు రెండో డోసుకు మధ్య 12 నుంచి 16 వారాల వ్యవధి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నేడు, రేపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఇక 45 ఏండ్లకు పైబడినవారికి అందజేస్తున్న వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మ‌ళ్లీ తిరిగి 17న ప్రారంభం కానుంది.