`వ‌కీల్ సాబ్‌`గా మారిన స్టార్ హీరో సూర్య‌..ఫొటోలు వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్‌. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌లె విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో న‌ల్ల కోటు ధ‌రించి వ‌కీల్ సాబ్‌గా ప‌వ‌న్ అద‌ర‌గొట్టేశాడు.

 కోలీవుడ్ హీరో సూర్య తొలిసారి ’వకీల్ సాబ్‌’ పాత్రలో ఎలా అలరించనున్నారనే విషయమై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. (Twitter/Photo)

అయితే ఇప్పుడు ప‌వ‌న్ మాదిరిగానే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా వ‌కీల్ సాబ్‌గా మారాడు. ప్ర‌స్తుతం సూర్య టిజే జ్ఞానవేల్ దర్శక‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో మొద‌టి సారి సూర్య లాయ‌ర్ పాత్ర పోషిస్తున్నాడు.

 తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా టిజే జ్ఞానవేల్ దర్శకుడి చిత్రంలో తొలిసారి లాయర్ పాత్రలో అలరించనున్నారు. తాజాగా ఈయన షూటింగ్ లొకేషన్‌లో వకీల్ సాబ్‌గా నల్లకోటు వేసుకున్న సూర్య ఫోటోలు సోషల్ మీడియాలో లీకైయ్యాయి. (Twitter/Photo)

తాజాగా ఈయన షూటింగ్ లొకేషన్‌లో వకీల్ సాబ్‌గా నల్లకోటు వేసుకున్న ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Share post:

Latest